Categories
ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. చెవుల పై చాలా సేపు ఉండటం వల్ల బ్యాక్టీరియా అంటుకోవటం సహజం బ్యాగుల్లో జేబుల్లో ఉంచుకోవటం వల్ల డస్ట్ పేరుకుపోతుంది. ఇయర్ ఫోన్, చెవి లోపల వరకు పెడతాం కనుక వాటిపై పేరుకున్న దుమ్ము ఇయర్ బడ్ లేదా మెత్తని బట్టను శానిటైజర్ లో ముంచి శుభ్రపరచుకోవాలి. తేమలేని టూత్ బ్రష్ తో ఇయర్ ఫోన్ లో ఉండే మట్టి తొలగించాక, ఫోన్ ల పైన ఉండే మెత్తని సిలికాన్, రబ్బర్ బడ్స్ తీసి గోరువెచ్చని నీటిలో వేసి సబ్బుతో కడగాలి. హెడ్ ఫోన్ లను మెత్తని బట్టను శానిటైజర్ లో ముంచి శుభ్రం చేయాలి. మెత్తని ఇయర్ ప్యాడ్స్ టవల్ తో తుడవాలి. వారం రోజులకు కొకసారి హ్యాండ్ శానిటైజర్ తో వాటిని శుభ్రం చేస్తే చెవిలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.