- నేను వెనకడుగు వేయను రొమ్ము కాన్సర్ నీ జయిస్తాను అంటూ ప్రముఖ నటి హంసా నందిని సామాజిక మాధ్యమాల్లో తన జుట్టు లేకుండా ఉండే ఫోటో పోస్ట్ చేసి మరీ తన కాన్సర్ గురించి చెప్పుకొచ్చింది. కథానాయకగా ప్రత్యేక గీతాలు నర్తకిగా తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హంసా నందిని నిండైన ఆత్మవిశ్వాసంతో తన కథ చెప్పింది. 4 నెలల క్రితం రొమ్ములో కణితి ఉందని చూసి వైద్యులను సంప్రదిస్తే రొమ్ముక్యాన్సర్ అన్నారు ఆపరేషన్ తో కనితి తొలగించారు. నాకు జన్యుపరమైన క్యాన్సర్ కూడా రావటానికి అవకాశం ఉందని తేలింది. 18 సంవత్సరాల క్రితం మా అమ్మ ఇదే క్యాన్సర్ తో చనిపోయింది నేను బాధితురాలిగా మిగిలిపోవాలి అనుకోవటం లేదు క్యాన్సర్ తో పోరాడతాను. ఇప్పటికీ 9 కీమోథెరపీ లు అయ్యాయి ఇంకో ఏడున్నాయి. ఏమైనా ఈ అనారోగ్యాన్ని గెలిచి మీ ముందుకు నవ్వుతా వస్తాను అంటుంది హంసా నందిని. క్యాన్సర్ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేలా ఉంది ఆమె పోస్ట్.