బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది నిజమే కానీ ఈ లాక్ డౌన్ తో పనులు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించు కోకుండా వది లేయ లేకపొయాను. ఇప్పుడు నూటయాభై మంది కోసం వండి పెడుతున్నాము అలాగే ఇంట్లో వుండి వంటలు చేసుకోగలిగే సుమారు నూట ఇరవై మందికి సరుకులు పంపిణి చేస్తున్నాం అంటోంది ఉష సి.  కోల్‌కతా లోని జాదవ్ పూర్ దగ్గర విజయ గఢ్ లో వంటలు తయారవుతున్నాయి. వంతుల వారిగా మా టీమ్ సభ్యులం అందరం వెళ్ళి ఆహారం పంపిణీ చేస్తున్నాం మాస్క్ లు ధరిస్తున్నాం భౌతిక దూరం పాటిస్తున్నాం అంటోంది ఉష సి చక్రబర్తి.

Leave a comment