ప్రపంచంలో తియ్యని పదార్థాలను తేనె తో పోలుస్తారు. తేనే ఎంత మధురం అంటారు. తేనె మంచి ఆహార ఔషధం కూడా. మనం ఎప్పుడూ చూసే తేనె కంటే అద్భుతమైన ఔషధ శక్తి ఉన్న తేనె టర్కీ లో దొరుకుతుందట అక్కడి అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించే ఒక 100 గ్రాముల తేనె లో 25 మిల్లీ గ్రాములు సి-విటమిన్ ఉందట. మిగతా తేనెల్లో 100 గ్రాములకు 6.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ అంజర్ తేనె కంటే టర్కీ కి చెందిన ఎల్విష్ హనీ.సరికాయిర్ అనే లోయలో 1800 మీటర్ల లోతు నా ఉన్న ఒక గుహలో బ్రహ్మాండమైన తేనెపట్టు చూశాడట గుండజ్ అనే తేనె సేకరించి అతను అక్కడున్న తేనే  తేనే పట్టు ఎంత పెద్దవో అర్ధం కానంతగా  ఉన్నాయిట. ఒకే ఒక తేనెపట్టు నుంచి 18 కిలోల తేనె సేకరించి వచ్చిన అతను ఆ తేనే రుచి చూసి దాన్ని ఫ్రాన్స్ లోని ప్రయోగశాలలో విశ్లేషిస్తాస్తే ఖనిజాలు, విటమిన్లు అందులో పుష్కలంగా ఉన్నాయని తేలింది. కిలో తేనె 38 లక్షలకు అమ్మా డట. ఆ గుహ లోని తేనె  గురించి ప్రపంచం మొత్తం తెలిసింది.తేనె కు డిమాండ్ వచ్చింది గుండాజ్ ఆ తేనె పేరు ఎల్విష్ హానీ అనే పేరు పెట్టి అమ్ముతున్నాడు. ప్రస్తుతం ఖరీదు 5 లక్షలకు పైనే ఉందట .

Leave a comment