నక్క పిల్ల కోసం దిగుడు బావి లో దిగింది మొహమ్మద్ సుమ మహబూబాబాద్ కు చెందిన ఈ అమ్మాయికి  మూగజీవాల పైన అంతులేని ప్రేమ ఎక్కడ ఏ పక్షి ఏ జంతువు బాధ పడుతున్న చూడలేదు .ఇప్పటికీ 120 కి పైగా కాకులు, కోతులు, తేగ దూడలు, కొండచిలువల్ని కూడా రక్షించింది .ఎవరైనా పలాని జంతువు ఏ గోతి లోనో, కాలువ లోనో  పడిపోయిందని చెప్తే చాలు వెంటనే వాటిని రక్షించేందుకు రంగంలోకి దూకుతుంది సుమ. అమ్మ సలీమా నాన్న సుభానీ ల దగ్గర నుంచి ఈ మూగ జీవాలపై శ్రద్ధ చూపించటం నేర్చుకుంది సుమ.  ఒక నక్క పిల్ల కోసం దిగుడు బావి లో దిగిన సుమా సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. నోరులేని జంతువులపై కరుణ చూపేందుకు గాను గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ చేతులమీదుగా అవార్డు అందుకుంది సుమ. సంగీతం అంటే ఇష్టం అని చెప్తే సుమా అన్నమాచార్య కీర్తన ఒకటి నేర్చుకుని తిరుమలలో భగవంతుడి సన్నిధిలో పాడాలనే కోరిక అని చెబుతోంది. ఇన్ని జంతువులను ప్రాణాపాయం నుంచి రక్షించిన సుమ కోరికను ఆ భగవంతుడు మటుకు కాదంటాడా ?

Leave a comment