వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా వుండటం మొదటి మార్గం. ఒక వేళ బయటకు వెళ్ళవలసి వస్తే వీలైనంత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. ప్రతి నలుగు గంటలకు ఒక్క సారి రీ అప్లయ్ చేస్తూ వుండాలి. చర్మం దాదాపు కవర్ చేయగల కాటన్ వస్త్రాన్ని ధరించాలి. రాత్రి వేళ అలోవీరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం పై ప్రభావం తగ్గుతుంది. శరీరమే కాకుండా చర్మము డీహైడ్రేషన్ కు లోనవ్వుతుంది. చమటకు చర్మం తో హైడ్రేషన్ తగ్గుతుంది. మరింత సన్ బర్నింగ్ కు గురవ్వుతుంది. పెదవులు పగులుతాయి. అంచేత దాహం తో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకు మంచి నీళ్ళు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తాగాలి. వేసవిలో గల దుమ్ము ప్రభావానికి జిడ్డు కాలుష్యం ఎక్కువ. ఇవి మొటిమలు రావడానికి కారణం అవ్వుతాయి. బయట నుంచి రాగానే ముఖం మెడ వాష్ చేసుకోవాలి.
Categories