Categories
ఒక చక్కని మారథాన్ నిర్వహించారు దుబాయ్ లో నివశించే భార్యాభర్తలు. దక్షిణాఫ్రికా కు చెందిన కొలిన్ ఎలిన్,ఈయన భార్య హిల్టా,ఇరవై మీటర్ల పొడవు వున్నవాళ్ళు బాల్కనీ పైన 26 మైళ్ళ మారథాన్ చేశారు.ప్రస్తుతం కరోనా భయంతో ఉన్నప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచాలనే ఉద్దేశ్యం తో ఈ ప్రయత్నం చేశారు. అయిదు గంటల తొమ్మిది నిముషాల పాటు ఈ మారథాన్ కొనసాగించింది. ఆ సమయంలో వాళ్ళ పద్దేళ్ళ కూతురు గీనా,అమ్మానాన్నలకు మంచినీళ్ళు,స్నాక్స్,చక్కని సంగీతం వినిపించి తన మద్దతుగా సహాకరించిందట. ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటలు నడవండి,ఇంట్లో కూర్చోకండి అని చెపుతున్నారు ఈ భార్యాభర్తలు.