Categories
Gagana

క్రేవింగ్స్ రచయిత్రి క్రీసీ టీగెన్.

వంటలా అబ్బే అనే వాళ్ళు వుంటే ఉండొచ్చు కానీ అసలు మంచి షెఫ్ కొనాలన్న కోరికతో ఎదిగి టాప్ మోడల్, టీవి హోస్ట్, వీడియో సాంగ్ యాక్ట్రెస్ చివరగా మంచి వంటల పుస్తకాల రచయిత్రి క్రీస్ టీగెన్ గురించి చదివితే వంటలని అంత తేలికగా చేసేయలేదు క్రీసీ అమెరికా రాష్ట్రంలోని డెల్టాలో పుట్టి పెరిగింది. మంచి వంటలు రుచి చూడడం కాదు వండి పెట్టాలని క్రీసీ ఆశయం. 2010లో మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ర్యంప్స్ పైన కాట్ వాక్  చేసింది. కాలండర్ లకు, మ్యాగజిన్ లకు కవర్ పేజీ మోడల్ గా ఎదిగింది. న్యుయార్క టైమ్స్ బెస్ట్ సేల్డ్ బుక్ క్రేవింగ్స్ అనే వంటల పుస్తకంరాసింది. క్రీసి టీగెన్స్ హంగ్రీ అనే వంటల చానల్ ప్రారంభించింది. ఏంటి వీటిలో ప్రసారం అయ్యే స్నాక్స్ అఫ్ అనే కుకింగ్ షోలో జుడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఫాభ్ లైఫ్ అనే లైఫ్ స్టైల్ షో కి క్రీసి ఫుడ్ స్టయిలిస్ట్ గా వుంది. ఇంత సంబందించింది కనుక టైమ్స్ మాగజైన్ ప్రపంచలోని 25 మంది స్ఫూర్తి దాయక మహిళల్లో క్రీసి పేరు తెచ్చుకుంది. ఎదుగుతున్న ఏ ఆడపిల్లకయినా క్రీసి స్ఫూర్తి.

Leave a comment