కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయుడికి శత   కోటి వందనాలు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉన్న శ్రీ ధ్యానాంజనేయుల వారి  ఆలయం అత్యంత శక్తివంతమైనది.పూర్వం గోలుకొండను పరిపాలించిన కాకతీయుల ప్రభువు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. కలలో కనిపించి ఆంజనేయ స్వామి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించారు.హనుమజ్జయంతి నాడు షోడశోపచారాలతో ధ్యానాంజనేయుడిని ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో కొలిచే వారు.
ఈ స్వామికి కొలవలేనంత శక్తి,నమ్మకం ఉంది.కొత్త వాహనానికి మరి స్వామి దగ్గరే పూజ తప్పనిసరి.ఎల్లవేళలా మనకు శక్తిని ప్రసాదిస్తాడు.ఈ స్వామి దర్శనం చేసుకుని బయలుదేరితే సకల శుభాలు కలుగుతాయి. దసరా నవరాత్రులో స్వామి వారి కటాక్షం కోసం భక్తులు తమ సరికొత్త వాహనాలతో కొలువు తీరుతారు సుమ!!
ధ్యాన ముద్రలో ఉన్న ధ్యానాంజనేయుడు భక్తులకు వర ప్రదాత.

ఇష్టమైన రంగు:సింధూరం
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు
ఇష్టమైన అలంకారం: తమలపాకుల దండ,గారెల దండ.

నిత్య ప్రసాదం: కొబ్బరి, కేసరి,అన్ని రకాల పండ్లు
కేసరి తయారీ: బొంబాయి రవ్వ,పంచదార  జీడిపప్పు,కిస్మిస్,కుంకుమ పూవు

తయారీ విధానం: ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు తీసుకొని ముందుగా రవ్వని వేయించి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు మరగబెట్టాలి అందులో తగినంత పంచదార వేసి,వేయించిన రవ్వని నీళ్ళలో కలిపి గట్టి పడేదాక తిప్పి చివరిగా వేయించిన జీడి పప్పు,కిస్మిస్,కుంకుమ పువ్వు వేసి యాలకు పొడి వేస్తే సరి!!

     -తోలేటి వెంకట శిరీష

Leave a comment