Categories
పదేళ్ళ వయసు గల పిల్లలకు ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది సార్లు దగ్గు,జలుబులకు గురవుతారని ఒక సర్వే చెపుతోంది. ప్రతి సారి దగ్గు సిరప్ లు వాడటం,లేదా యాంటీ బయాటిక్స్ వాడటం నష్టము. ఇవి బాక్టీరియా పై పని చేస్తాయి. అందువల్ల ఇంట్లో తయారు చేసుకునే సిరప్ తీసుకోటం మేలు. దగ్గు బాధిస్తుంటే ఈ సిరప్ బాగా పని చేస్తుంది. కప్పు తేనె, అర కప్పు నిమ్మరసం, ఒక టీ స్పూన్ అల్లం రసం చిటికెడు పసుపు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇది మూడు రోజుల పాటు వాడుకోవచ్చు. కొద్దిగా బయటకు తీసి కాస్త వెచ్చ చేసి ఒక్క స్పూన్ చొప్పున మూడు సార్లు ఇస్తూ వుంటే దగ్గుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.