Categories
ఎండలో వెళ్ళినప్పుడు ,వ్యాయామాలు చేస్తేనో దాహం వేస్తుంది . అలాగే చెమటలు పట్టేంత పనులు చేసినా దాహం వేస్తుంది . అయితే ఏ కారణమూ లేకుండా ప్రతి ఐదు పది నిముషాలకు దాహం వేస్తుంటే అది అనారోగ్య లక్షణంగా గుర్తించమంటున్నారు డాక్టర్లు . కిడ్నీలు,మధుమేహం,గుండె ,కాలేయాలు ,దెబ్బతినటం వంటి కారణాలతో దాహం ఎక్కువ కావచ్చు అంటున్నారు . అలాగే అధిక రక్తపోటు ,గుండె జబ్బు ,అలర్జీలు కూడా అతిదాహానికి కారణమే అంటున్నారు . అతిదాహంతో పాటు మూత్రవిసర్జన,కడుపునొప్పి ,నీరసం తలనొప్పి చూపు మసకగా అనిపిస్తే మటుకు ఆలస్యం చేయకుండా డాక్టరును కలుసుకోమంటున్నారు .