Categories
కొన్ని వారాల క్రితం సామాన్య గృహిణిగా ఉన్న 64 ఏళ్ల లీలమ్మ ఒక పెళ్లి లో డాన్స్ చేసి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది.కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పల్లిక్కర్ లో ఉంటున్న లీలమ్మ చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్స్ లో డాన్స్ చేసేది. అలా మొదలైన ఇష్టం పెద్దయినా ఏ స్నేహితుల ఇళ్లల్లో వేడుకలు జరిగిన డాన్స్ చేసేది. క్రితం నెల పట్టాంబి లో బంధువుల ఇంట్లో లీలమ్మ చేసిన డాన్స్ ను ఆమె కొడుకు సంతోష్ వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. రెండు రోజుల్లో 60 లక్షల మంది చూశారు. లీలమ్మ కు ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.