డైటింగ్,ఎక్సర్ సైజు ఒకేసారి చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్. బరువు తగ్గాలని వర్క్ వుట్స్ చేస్తూ అలాగే డైట్ లో కూడా చాలా మార్పులు తీసుకొస్తారు కొందరు. అలా ఎట్టి పరిస్థితిలోనూ వద్దంటున్నారు నిపుణులు ఇది ఎముకలకు చాలా ప్రమాదం అంటున్నారు. డైటింగ్ వల్ల శరీరానికి ఇవ్వవలసిన ఆహారం తగ్గిపోతుంది అదే సమయంలో ఎక్సర్ సైజు లు చేస్తే శరీరంలో కొవ్వు తగ్గుతుంది అప్పుడు కండరాలకు ఎముకలకు కావలసిన పోషకాలు అందవు ఒకే సమయం లో పోషకాలు తగ్గి ఎక్సర్ సైజ్ లు చేస్తే శరీరం తట్టుకోలేదు.ముఖ్యంగా మహిళల్లో వయస్సు పెరుగుతున్న కొద్దీ సహజంగానే వారి ఎముకలు బలం తగ్గి పోతుంది. అందుకోసం పౌష్టికాహారం తీసుకోవలసి వస్తుంది .ఒకేసారి డైటింగ్ ఎక్సర్సైజ్ లు చేస్తే వారిలో ఎముకల మధ్య లో ఉండే బోన్ మారో ఫ్యాట్ పెరిగిపోతుంది సరైన పోషకాలు అందక ఈ ఫ్యాట్ పెరిగిపోవటంతో ఎముకల పటిష్టత దెబ్బతింటుంది. 30 ఏళ్ళ వయసులో మహిళలకు రోజుకి 2000 కేలరీలు శక్తి కి సరఫరా ఆహారం తీసుకోవాలి. డైటింగ్ చేసేవారు 30 శాతం తక్కువ ఆహారం తీసుకోవటంతో కేలరీల సంఖ్య 1400 కి తగ్గుతుంది .మహిళలు వారానికి 450 గ్రాముల బరువు తగ్గుతున్నారు. ఇందువల్ల దీర్ఘకాలంలో ఎముకలు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు పరిశోధకులు అంచేత  డైటింగ్ ఎక్సర్ సైజు రెండు ఒకేసారి డేంజర్ !

Leave a comment