Categories
ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళుతుంది ఏంజెల్ నికోల్. రష్యా కు చెందిన ఏంజెలా సెల్ఫీ లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు ఆమెను స్పైడర్ గర్ల్ డేంజరస్ సెల్ఫీ గర్ల్ అంటారు కొండలు, టవర్లు, భవనాలు, స్కై స్క్రేపర్ ఇట్లా ఏం కనిపించినా ఎక్కేసి సెల్ఫీలు తీసేసుకొంటుంది. ఆమె తీసే ప్రమాదకరమైన సెల్ఫీలు ఇప్పుడు ట్రెండ్. ఆమె స్నేహితుడు ఫోటోగ్రాఫర్ ఇవాన్ తోడుగా ఎత్తైన భవనాల అంచున డాన్స్ ఫోజులు చేస్తుంది. అమెరికా, చైనా, హాంగ్ కాంగ్, ఫ్రాన్స్, శ్రీలంక వంటి దేశాల్లో ఎత్తైన కట్టడాలు పైన ప్రయోగాలు చేసి కోట్లకొద్దీ అభిమానులను సంపాదించుకుంది ఏంజెల్ నికోల్.