ఆహారపదార్ధాలలోని చక్కెరతో సహజంగా పట్టే గార వల్ల దంతాలకు హాని కలుగుతుంది. చీజ్ ఈ సమస్యను తగ్గిస్తుంది అంటున్నారు డాక్టర్స్. దంతాల పైన ఉండే ఎనామిల్ పొరను కాపాడుతుంది ఛీజ్. ఇందులో ఫాస్పేట్ , క్యాసిన్ అనే హానికరం కాని రసాయనాలు ఉంటాయి. ఇవి కాల్షియం తో కలిసి దంతాల పై ఏర్పడే సూక్ష్మమైన పగుళ్లను కప్పేస్తాయి. తగు మొతాదులో ప్రతి ఒక్కరు ఛీజ్ ను ఆహారంలో తీసుకుంటే అది మనకు సంతులిత ఆహారంగా ఉండి శరీరంలోని అన్ని అవయవాలకు కావలిసిన పోషకాలు విటమిన్ లు అందిస్తుంది.

Leave a comment