డార్నెల్ల ఫ్రేజియర్ 17 సంవత్సరాల హైస్కూల్ విద్యార్థిని మే నెల 25 వ రాత్రి తన తొమ్మిదేళ్ల కజిన్ తో కలిసి తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కేఫ్ ఫుడ్స్ స్టోర్స్ కు వెళ్ళింది. అక్కడే జార్జ్ ఫ్లాయిడ్ సిగరెట్లు కొన్ని నకిలీ నోటు ఇచ్చాడనీ ఆరోపణ. డార్నెల్ల షాప్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ కింద పడేసి మెడపైన మోకాలితో నొక్కటం చూసింది.ఊపిరి అందక కుట్టుకుంటూ జార్జ్ వేడుకోవటాన్ని ఈ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ తో వీడియో తీసింది .నల్ల జాతీయులు ఉసురు తీసిన పోలీస్ నిర్వాకంపై తిరుగులేని సాక్ష్యం ఇది దీన్ని ఫోన్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు డార్నెల్ల కు తాను అమెరికా చరిత్రలోనే ఎంతో ముఖ్యమైన హై ప్రొఫైల్ పోలీస్ హత్యల్లో ఒకటైన ఈ సంఘటనకు తాను సాక్షినని దీన్ని నమోదు చేస్తున్నానని తెలిపారు. పోలీస్ ల క్రూరత్వానికి గుర్తుగా ఈ సంఘటనని రికార్డు చేసిన ఈ 17 ఏళ్ల అమ్మాయి మాత్రం చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
Categories