ఈ లాక్‌డౌన్‌ సమయంలో చూడవలసిన ఇంకో గొప్ప సినిమా వికృతి. మెట్రో రైల్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఎల్దో అతని భార్య ఎల్సీ ఇద్దరూ బధిరులు. ఎల్దో స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో ఐ సి యు లో ఉంటుంది రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్దో ఒళ్ళు తెలియకుండా మెట్రో రైల్లో నిద్రపోతాడు.ఆ సమయంలో ఆ రైల్ లో ఉన్న ఇంకో ప్రయాణికుడు సమీర్ అతని ఫోటో తీసి తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నాడని ఫేస్ బుక్ లో పెడతాడు. అది కాస్తా వైరల్    ఎల్దో ఉద్యోగం కాస్తా పోతుంది. సుఖంగా జీవిస్తున్న వాళ్ళు అనవసర వేదనకు గురవుతారు. ఇది సినిమా మొదలు. అస్తమానం ఫేస్ బుక్ లో కనబడే ప్రతి విషయం తమకు సంబంధం లేకపోయినా పోస్ట్ చేసే వాళ్లు తప్పకుండా ఆలోచనలో పడే సినిమా ఇది.చాలా బావుంది .నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూడండి .

Leave a comment