హైద్రాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు దర్శన్ దర్శన్ రంగనాథన్ . ఆమె కృత్రిమ రసాయన మూలకాలు ,హైబ్రెడ్ పెప్లైడ్ ,నానోట్యూబ్ తయారీలో నిష్ణాతురాలు . సేంద్రియ రసాయనిక శాస్త్రవేత్త . ఢిల్లీకి చెందిన దర్శన్ మదాన్ అక్కడే ఫై హెచ్ డీ చేశారు . తరువాత కాన్పూర్ ఐ ఐ టీ లో ,చదువుతూ సహవిద్యార్ది సుబ్రమణియ దర్శన్ రంగనాథన్ ను వివాహం చేసుకొన్నారు . త్రివేండ్రంలోని రీజనల్ రిసెర్చి లేబొరేటరీ లో చేరిన దర్శన్ తరువాత ఐ ఐ టీ కి డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు . ప్రకృతిలో జరిగే రసాయన ప్రక్రియలను పరిశోధక శాలల్లో కృత్రిమంగా సృష్టించటం తద్వారా మానవాళికి ఉపయోగ పడే పదార్దాలు సృష్టించటం దర్శన్ ప్రత్యేకత . పార్మా రంగంలో కీలకమైన ఐమిడ్ జోల్ ఉత్పత్తికి ప్రత్యేక పద్దతిని అభివృద్ధి చేశారు .
Categories