బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ . ఆమె కలకత్తా లో 1917 సెప్టెంబర్ 23న జన్మించారు. తండ్రి ప్రోత్సహంతో కలకత్తా లోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936 లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు 1938 లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు . ఆమె పరిశోధన  ఫలితంగానే మూర్ఛవ్యాధి ని ,మలేరియా మందుల తయారీకి ,కేన్సర్ చికిస్థలో ఉపయోగపడే కీమో థెరపీ కి మందుల తయారీకి మార్గం దొరికింది . ఆమె రాష్ట్రసభ సభ్యురాలుగా ఉన్నారు . ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో పద్మభూషన్ తో సత్కరించింది ప్రభుత్వం .

Leave a comment