Categories
అన్నింటికీ మందులు వాడక్కర్లేదు. కొన్నింటిని ఆహార విధానాలు కాస్త మార్చితే సరిపోతుంది . డాక్టర్లు అధిక రక్తపోటును హెపర్ టెన్షన్ తగ్గించు కొనేందుకు డాష్ డైట్ ను సూచిస్తారు. డాష్ అంటే డైటర్ అప్రోచెస్ టు స్టాప్ హెపర్ టెన్షన్ అని అర్ధం చేసుకోవచ్చు . రోజూ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే పచ్చళ్ళు చిప్స్ తినకూడదు . పండ్లు కూరలు రోజుకు ఐదారు సార్లుగా తినాలి . పప్పులు,గింజలు కాయ ధాన్యాలు తినాలి . రెండుమూడు సార్లు కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్దాలు తినాలి . పాలు తాగాలి . వాటి ద్వారా ప్రోటీన్లు ,కాల్షియం లభిస్తాయి .