Categories
చాలా ఉత్పత్తుల పైన ఎక్స్ పైరీ డేట్, యుజ్ బిఫోర్ డేట్ రెండూ ఉంటాయి. ఈ రెండు వేరు వేరు. ఎక్స్ పైరీ డేట్ దాటిదకూడదు. బెస్ట్ బిఫోర్ డేట్ అంటే అంటే ఆ తేదీ లోపు వాడితే మంచిది. తదుపరి వాడినా ఇబ్బందే, హామీ వుండదు. కానీ అంతకు ముందున్న రుచి రూపం ఉండక పోవొచ్చు. ఏ రకమైన ఉత్పత్తి అయినా ఎక్స్ పైరీ డేట్ అయినా బెస్ట్బిఫోర్ డేట్ అయినా దాని పైన సూచించిన తేదీకి ముందుగానే వదేయడం ఉత్తమం పైగా కొన్ని రకాల మందుల పరిమితి దాటిపోతే పని చేయవు సరికదా కొత్త కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం వుంటుంది. అలాగే ఒక టీ పాకెట్ పైన ఫలానా తేదీ తర్వాత వాడకూడదు. అని వుంటే ఆ ఎక్స్ పైరీ డేట్ దాటిపోయాక, ఆ ఆకులో వున్నా మంచి సుగునలన్నీ పోయి పురుగులు పట్టేయోచ్చు. అంచేత ఏవైనా పరిమితి కాలంలోనే వాడాలి.