అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత, ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు రెండు వందల రూపాయల వేతనం తో ఆస్పత్రి ప్రాంగణం లోనే ఒ గదిలో వుంటూ ఇరవై నాలుగు గంటలు సేవలందించారు.1982 లో ప్రభుత్వ అనుమతుతో అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్లో అంకాలజీ సైన్సెస్ లో ఆమె బౌతికంగా దూరమైన ఎంతోమంది జీవితాన్ని ప్రసాదించిన దేవతగా నిలిచిపోయారు.

Leave a comment