అతి చిన్న సందేహం కలిగినా, ఏదైనా ప్రత్యేక మైన వంటకం చేయాలన్నా సౌందర్య పోషణకైనా అంతర్జాలంలోకి తొంగి చూడటం ఈ రోజుల్లో అందరికీ సహజమైన ఆలవాటై పోయింది. ఇది మంచిదే కానీ రోజులో ఎంతో సమయం ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఖర్చు పెట్టడం కూడా డబ్బు వృధా చేసినట్లే. కాలక్షేపం కోసం కావొచ్చునెట్ ని గంటల కొద్దీ ఉపయోగించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రయోజనం పొందుతాం సరే, ఖర్చు పెట్టే సమయం మాటేమిటి? ఆఫీస్ పని గంటలు అవ్వటం ఆలస్యం. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ కంప్యుటర్కు అతుక్కుపోతుంటారు. దీని వల్ల కుటుంబ సంబందాలు దెబ్బతింటాయి. వత్తిడి పెరుగుతుంది అందుకే వీలైనంత సమయం సంకేతికతకు చోటివ్వకపోవడం మంచిది. ఖచ్చితమైన సమయం, ఓ గంటో, రెండు గంటలో అంతే. ముఖ్యంగా పడక గదికి ఈ స్మార్ట్ ఫోన్ లు తీసుకు వెళ్ళక పోవడమే క్షేమం. అలసిన మెదడుకి విశ్రాంతి ఇవ్వాలి.

Leave a comment