Categories
డిప్రషన్ సమస్యను ఆరోగ్యకరమైన ఆహారంతో తగ్గించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయన కారులు . మ్యుఖంగా ప్రోటీన్ పదార్దాలు స్వీట్లు మానేసి ,పోషకాహారం తీసుకొంటే 32 శాతం మందికి డిప్రషన్ తగ్గిందట . శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రషన్ లక్షణాలు కల్పిస్తాయి . ముడిపదార్దాలు సీ ఫుడ్ తినమంటున్నారు . విటమిన్ డి లోపంవల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది . గనుక ఉదయపు ఎండలో తిరగాలి. చేపలు,పుట్ట గొడుగులు తినాలి . ఒమేగా లోని ఫ్యాటీ ఆమ్లాల లోపం డిప్రషన్ కు దారితీస్తుంది . మెదడుకి ఆరోగ్యకరమైన కొవ్వుల్ని అందించటం ద్వారా నాడీ కణాలు కాపాడే మైలిన్ పోరా సంరక్షణకు ఈ ఫ్యాటీ ఆమ్లాలు తోడ్పడతాయి . ఇవి చేపలు అవిస ,బాదం ,పిస్తా వాల్ నట్స్ లో పుష్కలంగా ఉంటాయి .