ఐశ్వర్యా రాయ్ అనంగానే ఇక అందం గురించి మాట్లాడేదేమిటి అనిపిస్తుందా లేదా. ఆమె లోరియల్ ప్యారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుంది. సాధారణంగా యాడ్స్ చూపిస్తూ ఆమె నారుపం వెరీ సింపుల్ నేను లోరియల్ ప్యారీస్ ప్యూర్ రెడ్ కాలక్షన్ నుంచి లిప్ కలర్ ఎంచుకుంటాననో, మిలియన్ ల్యాషెస్ మస్కారా వుపయోగిస్తా అని చెప్పుతున్నప్పుడు నిజంగా అంట గొప్ప గ్రాండ్ వస్తువులనే ఆమె వుపయోగించి దేవసుందరి లాగా అయిపోయిందను కొంటా కదా. ఇప్పుడు చూడండి ఆమె ఏం అంటుందో … నేను ఇంట్లో తయ్యారు చేసుకున్న సెనగ పిండి పసుపు, రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి మెడకు పట్టిస్తే ఇది చర్మానికి మేలు చేస్తుంది. అలాగే అందంగా ఆరోగ్యంగా వుండేందుకు నిరంతరం ద్రవ పదార్ధాలు తాగుతానంటుంది ఒక ఇంటర్ వ్యూలో అంటే ఈ సౌందర్య దేవత సౌందర్య రహస్యం సింపుల్ గా వంటింటి వస్తువులే కదా.
Categories