Categories
ముంభైకి చెందిన నసీఫా వాళ్ళబ్బాయి ముసాఫ్ కపాడియా గూగుల్లో ఉద్యోగం . నసీఫా బోహ్రీ వంటకాలు బాగా చేస్తుంది. ముసాఫ్ తన స్నేహితులను ఇంటి వంట ముఖ్యంగా అమ్మ చేతివంట తినండి అని తన స్నేహితులను విందుకు ఆహ్వనించాడు. వచ్చిన స్నేహితులు విందు భోజనం గురించి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇది జరిగింది 2014లో ఇప్పుడా స్నేహితుల కోసం వారాంతాల్లో ఇచ్చిన విందు భోజనం కాస్తా వ్యాపారం అయిపోయి ది బోహ్రీ కిచెన్ పేరుతో ముంభై మొత్తానికి ఆహారం పార్శిల్ రూపంలో అందుబాతుంది. క్యాటరింగ్ సేవాల్ని అందిస్తుంది. నసీఫా చేసిన అద్భుతమైన వంటకి దక్కిన ప్రతిఫలం ఈ వ్యాపారం ఇప్పుడు ముసాఫ్ కపాడియా జాబ్ మానేసి అమ్మ కంపెనీ సిఇజ్ అయిపోయాడు .కొత్తగా వ్యాపార ఆలోచనల చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ కథ.