Categories
Wahrevaa

మెండుగా పోషక విలువలున్న నిమ్మ.

వేసవి వెళ్ళినా సరే చల్లదనం కోసం తాగే నిమ్మ షర్బత్ వారాల్లో కూడా మంచిదే. నిమ్మకాయ, మజ్జిగ, నిమ్మసోడా, ఇవన్నీ సాధారణ రోజుల్లో కూడా తాగాలి. నిమ్మరసానికి శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు బయటికి వండే గుణం వుంది. ఇది బరువును నియంత్రించడంలో మంచి ఔషదం. నీళ్ళు, నిమ్మరసం, తేనె ఎప్పటికీ వాడదగిన పానీయమే. ఆహారపు నియంత్రణకు తోడూ నిమ్మరసం తప్పనిసరి. శరీరంలో జరిగే జీవక్రియలు ఫలితంగా కాలేయంలో చేరిన విషపూరితమైన పదార్ధాలు బయటికి పంపి ఆ అంగాల పని తీరు మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పరిచి శరీరానికి మంచి ఆరోగ్యం అందిస్తుంది. రోగకారక జీవులను నిరోధించే శక్తి నిమ్మకు వుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియంఫ మొదలైనవాటితో పాటు విటమిన్ ఎ,బి,బి6 వంటివి లభిస్తాయి. ఈ పోషక విలువలు ప్రతి మనిషికీ అవసరమే.

Leave a comment