బయటి వాతావరణానికి ఎక్కువగా ఫోకస్ అయ్యే అమ్మాయిలకు టాన్ సమస్య వస్తుంది. దీనికి ఫ్లోరల్ పేస్ మాస్కలు బాగా పని చేస్తాయి. మందారాలు, గులాబీలు, బంతి, తామర వంటి పువ్వులతో ఫేస్ పాక్ లు చేసుకుని వాడితే టాన్ సమస్య పోతుంది. పొద్దుతిరుగుడు పువ్వుల్లో విటమిన్-ఇ పుష్కలం. అలాగే టమాటోల్లోని లైకొపిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వును మెత్తగా నూరి టొమాటో గుజ్జు, పచ్చిపాలు కలిపిన ఫేస్ ఫ్యాక్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. గులాబీ పూల ఫేస్ ప్యాక్ అన్ని రకాల స్కిన్ టిప్స్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ చల్లనిది. శాండల్ వుడ్ పౌడర్ లు గులాబీల గుజ్జు, కొబ్బరి నీళ్ళు కనిపిన పేస్టు ఫేస్ ప్యాక్ గా వేస్తె టాన్ వెంటనే తగ్గిపోతుంది. అలాగే మందార పువ్వుల్లో ఓట్స్, టీట్రీ ఆయిల్స్ కలిపి గుజ్జుగా చేసి ఫేస్ ప్యాక్ వేసినా ప్రయోజనమే ఇవన్నీ సహజసిద్దమైనవి కాబట్టి ఎలాటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.
Categories