నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన పని అయినా సరే చివరి క్షణంలో హడావిడిగా ముగించేయవలసి వస్తుంది. అనుకున్న పనులేవీ కావు. న్యాయంగా ఒక పని వెంటనే పూర్తి చేయ గలిగితే ఆ ఏర్పడే సంతృప్తి తాయారు సంతోషం వల్ల మనసంతా తేలికగా అయిపోతుంది. అలా కాకుండా వాయిదాలతో మూల పడిన పని వల్ల మనదికమైన నిరాశ, చేతులారా పక్కన పదేసామనే అసంతృప్తి తెలియని అసహానానికి గురిచేస్తుంది. కనుక ఎప్పటి పని అప్పుడు వాయిదాలో లేకుండా, రేపు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పూర్తి చేయాలిఇది జీవితంలో మొదటి ప్రయారిటి కావాలి. వాయిదాలు వేయోద్దు.
Categories
Nemalika

వాయిదా తత్వంలో అంతా నిరాశే

నీహారికా,

కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన పని అయినా సరే చివరి క్షణంలో హడావిడిగా ముగించేయవలసి వస్తుంది. అనుకున్న పనులేవీ కావు. న్యాయంగా ఒక పని వెంటనే పూర్తి చేయ గలిగితే ఆ ఏర్పడే సంతృప్తి తాయారు సంతోషం వల్ల మనసంతా తేలికగా అయిపోతుంది. అలా కాకుండా వాయిదాలతో మూల పడిన పని వల్ల మనదికమైన నిరాశ, చేతులారా పక్కన పదేసామనే అసంతృప్తి తెలియని అసహానానికి గురిచేస్తుంది. కనుక ఎప్పటి పని అప్పుడు వాయిదాలో లేకుండా, రేపు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పూర్తి చేయాలిఇది జీవితంలో మొదటి ప్రయారిటి కావాలి. వాయిదాలు వేయోద్దు.

Leave a comment