ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి ట్రాన్స్ జెండర్ ఎస్.ఐ ఆమె హిజ్రాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుతున్న విషయంపై న్యాయపోరాటానికి దిగి తన తో పాటు మరో 21 మంది హిజ్రాలకు పోలీస్ జాబ్స్ వచ్చేలా చేసింది. ఈ వారంలో శిక్షణ పూర్తి చేసుకొన్న ప్రీతికా త్వరలోనే ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించనున్నది. తమిళనాడుకు చెందిన ప్రీతికా అబ్బాయిగా పుట్టి లింగ మార్పిడితో ఆడపిల్లగా మారింది. కంప్యుటర్ అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతికా ఎడతెరగని పోరాటం చేసి మరీ తనకు ఇష్టమైన పోలాన్ ఉద్యోగం సంపాదించింది. ఇక తన లక్ష్యం ఐ.పి.ఎస్ అధికారి కావడమేనని చెపుతుంది.

Leave a comment