Categories
ఇంట్లోంచి బయటకు కదలక పోవటం నిజానికి పెద్ద వయసు ఉన్న వాళ్ళకు ఇబ్బందే . తేలిక పాటి వ్యాయామం కూడా అందక శరీరం కదిలించే అవకాశం ఉండదు . వ్యాయామం మంచిదే కానీ చేసే అవకాశం తక్కువ కనుక ఆరోగ్య సమస్యలు రాకుండా తినే భోజనం పై దృష్టి పెట్టాలి . ప్రోటీన్లు ఎక్కువగా ఉంది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి .కాఫీ టీ లు కాస్త తగ్గించి తాజా పండ్లు కాయకురలు తీసుకోవాలి .అయితే బరువు పెరుగుతామన్న భయం తో డైటింగ్ జోలికి వెళ్ళ కూడదు .శరీరానికి పోషకాహారం అందకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి .శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఇంట్లో చిన్నచిన్న పనులు చేయటం గంటకోసారి లేచి అటూఇటూ తిరగటం మరచిపోవద్దు .ఇతరుల పై ఆధార పడకుండా చిన్నచిన్న పనులు చేసుకొంటే కొవ్వు కొంతయినా కరిగే అవకాశం ఉంది .