Categories
సోషల్ మీడియా వ్యసనం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు హోవార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు స్క్రీన్ సమయం పెరిగేకొద్దీ కళ్ళు, మెడ, వెన్నుపాము సమస్యలతో పాటు అధిక బరువు గుండె జబ్బులు వస్తున్నాయి. సాధారణంగా మెదడు పైన ఉండే కొర్ టెక్స్ పొర పంచేంద్రియాల నుంచి సేకరించిన సమాచారం విశ్లేషించడం, అవగాహన చేసుకోవడం దృష్టి పెట్టడం వంటి పనులు చేస్తుంది. ఫోన్ వాడకం తో ఆపోరా పల్చబడి ఆ పనులన్నీ ముందు ముందే ముగిస్తూ జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ సమాచారంతో మెదడు దీన్ని గుర్తు పెట్టుకోవాలో, దేన్ని మర్చిపోవాలో తెలియక సతమతం అవుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. కనీసం వారానికి ఒక రోజైనా డిజిటల్ ఫాస్టింగ్ అంటే మొబైల్ కు దూరం ఉంటాననే ఉపవాసం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్.