Categories
ఎప్పుడు పనిలో మునిగి ఉంటాం .ఇంట్లో పనీ లేదా ఆఫీస్ పనీ స్ట్రిక్ట్ గా భోజన వేళలు పాటించలేక పోతాం.లేదా ఎక్కువ సార్లు కాఫీ ఫ్యాట్ వంటివి ఉన్నా ఆహారం తీసుకొవటం వల్లనో కడుపులో బాక్టీరియా వల్ల అనారోగ్యం రావచ్చు. అలాంటప్పుడు మందులు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ,యాంటీ బాక్టీరియా గుణాలు కలిగి ఉంటాయి. అల్లం మెత్తగా దంచి ఏవీ కలపకుండా చిక్కగా రసం పిండి దీనిలో తేనె ,నిమ్మ రసం కలిపి నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే చాలు .కడుపులో సమస్య పోతుంది. రెండు రోజుల పాటు కడుపులో బావున్న సరే అరస్ఫూన్ అల్లం తేనె కలుపుకొని భోజనం ,టిఫిన్ చేసే ముందర తీసుకొంటే చాలు. అన్నీ సమస్యలు పోతాయి.