మానసిక భావోద్వేగ సమస్యల నుంచి బయటపడేందుకు డాన్స్ థెరఫీ మంచిదంటున్నారు .ఇందులో శారీరక కదలికలతో పాటు ధ్యానం ,యోగా, నటన, చిత్రకళ వంటివి భాగంగా ఉంటాయి. ఇది విదేశాల్లో పాపులర్.మనదేశంలో అయితే భరత నాట్యం,కూచిపూడి వంటి నృత్యాలలో ఉన్నా కాళ్ళు చేతులు కదలికలు ముద్రలు వాటి కోసం శరీరం క్రమబద్దంగా కదలటం చేస్తారు.ఎన్నో సమస్యలకు మూలం బలవంతగా అణచబడ్డ భావోద్వేగాలు , ఇష్టంలేని చదువు ఒత్తిడే .స్వాతంత్రం లేని సంసారంలో చిక్కులే .జానపద నృత్యా భంగిమలతో ముఖకవళికలు మార్చటం ఒకరిద్దరి చేతులు పట్టుకొని ఒకరి మొహంలోకి ఒకళ్ళు చూసుకొంటూ భావాలు వ్యక్తీకరిస్తూ ముందుకు వెనక్కి కదలటం చికిత్సలో భాగం.శరీరాన్ని క్రమపద్దతిలో కదల్చటం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడి వ్యతిరేక భావోద్వేగాలు తగ్గి ఆత్మస్థైర్యంతో ఆలోచనలు పాజిటీవ్ గా మారతాయి. డాన్స్ థెరఫీ ప్రయోజనం ఇదే.

Leave a comment