మహిళల భద్రత పైన మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన చట్టం దిశ . ఈ చట్టం దోషికి నేరం రుజువైతే మరణ దండన విదిస్తుంది . లైంగిక దాడి నేరాల్లో స్పష్టమైన ,తిరుగులేని ఆధారాలు లభిస్తే వారం రోజుల్లో పోలీస్ ప్రక్రియ 21 రోజుల్లోనే దోషి కి శిక్ష పడాలి . పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు . మెయిల్స్ సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరేయినా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్ళు ,ఆ తర్వాత తప్పుకు నాలుగేళ్ళు శిక్ష పడేలా ఐ. పి . సి 354 (ఇ )అనే కొత్త సెక్షన్ చేర్చారు . ఈ దిశ చట్టం పగడ్బందీగా అమలు జరిపేందుకు ఐ . ఎ . ఎస్ అధికారిని కృతిక శుక్లా ,ఐ. పి . సిదీపిక లను స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించారు .

Leave a comment