Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/10/260px-Donna_Strickland_EM1B5760_46183560632_cropped.jpg)
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళ శాస్త్రవేత్త డోనా స్ట్రిక్ ల్యాండ్ ఆప్టికల్ ఫిజిసిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తారు. ‘పల్స్డ్ లేజర్స్’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు కెనడా కు చెందిన డోనా స్ట్రిక్ ల్యాండ్ కు నోబెల్ బహుమతి వచ్చింది. చర్ప్‌డ్ పల్స్ ఆంప్లిఫికేషన్) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్ చికిత్సలలో ఇది చక్కగా పనిచేస్తుంది.