Categories

కరోనా వైరస్ భయం,లాక్ డౌన్ టెన్షన్ వంటివి మనసులోకి రానివ్వకండి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. సైకియార్టిస్టులు ఉదయం కొద్దిసేపు మెడిటేషన్ చేయటం ద్వారా ఆలోచనలు కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు. పుస్తకాలు చదవటం,చిన్నప్పటి ఫొటోలు చూడటం మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు,హాస్యపు సన్నివేశాలు వంటివి మనుసుకి శాంతి ఇస్తాయంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇళ్ళలోనే శుభ్రంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్ట వచ్చని,సోషల్ మీడియా లో వచ్చే అసత్య వార్తలను నమ్మకండా ఉండటమే క్షేమం అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండమని సలహా ఇస్తున్నారు.