కరోనా వైరస్ వ్యాపించకుండా సామజిక దూరం పాటిస్తూ ఉన్నాం. సబ్బుతో చేతులు కడుక్కొంటూ శుభ్రత పాటిస్తున్నాం ఈ జాగ్రత్తలతో పాటు ముఖం పై చేతులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. చేతులకు అంటిన వైరస్ కళ్ళు,ముక్కు,నోరు ద్వారా చాలా త్వరగా శరీరం లోకి ప్రవేశిస్తుంది.ఆతృత,ఒత్తిడి ఉంటే కళ్ళు తుడుచు కోవటం,జుట్టు సవరించుకోవటం చేస్తారు. మన ప్రమేయం లేకుండా సుమారు గంటకు 9 నుంచి 23 సార్లు మన ముఖాన్ని తాకుతామని ఇది ఒక అలవాటుగా మారిపోయిందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇప్పుడు ఈ అలవాటుగా మారి పోయిందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అలవాటు ను కాస్త సవరించుకోవాలి. ఒత్తిడిగా ఉంటే చేతులలో స్ట్రెస్ బాల్ నొక్కటం రెండు చేతుల పిడికిలి బిగించి తొడల కింద పెట్టుకోవటం చేయాలి. ఏదైన దురద ఎలర్జీ వచ్చిన వేంటనే ఔషదాలు వాడటం బెస్ట్.

Leave a comment