Categories
దేశం చుట్టి రావాలంటే జీవిత కాలం సరిపోదు. కానీ కొత్త ప్రదేశాలు చూడాలంటే కాస్త ప్లానింగ్ ఉంటే సాధ్యం అవుతుంది. 70 ఏళ్ల సుధ మహాలింగం ఇప్పటికే 70 దేశాలు చుట్టేశారు. 25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సుధా ఇంట్లోనే పిల్లల పెంపకంలో 25 ఏళ్లు గడిపేసింది. గృహిణిగా ఉంటూనే ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ ఎక్స్‌పర్ట్ గా దేశవిదేశాల్లో కాన్ఫరెన్స్ లకు హాజరయ్యింది. అలా మొదలైన భ్రమణకాంక్ష సుధా నిలువ నివ్వలేదు ఒక్కతే నేపాల్ మీదుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ అధిరోహణ చేసింది. ‘ఉలురు’ లో స్కై డ్రైవింగ్ చేసింది. ఇండోనేషియాలోని రెయిన్ ఫారెస్ట్ లో గడిపింది. సుధా సాహసయాత్ర తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్.