వైవాహిక జీవతం గుండె జబ్బుల పై ప్రభావం చూపిస్తుందని యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భార్యతోనూ, తల్లితోనూ ఎంతో అనుబంధం ఉంచుకొనే వారి ఆరోగ్యం ఎంతో మెరుగైనదని బాడీ మాన్ ఇండెక్స్ మొదలు కొలెస్ట్రాల్ , రక్త పోటు వంటి సమస్యలు తగ్గిపోగా గుండె జబ్బుల విషయంలో మరింత మెరుగుదల నమోదైందని అంటున్నారు . గతంలో జరిగిన ఎన్నో అధ్యయనాలు పెళ్లికి ఆరోగ్యానికి సంబంధం ఉందని తేల్చాయని ఇప్పుడు 620 మందిపై జరిపిన ఈ ఆధ్యయనంలో భార్యతో గల అనుబంధం ,మనస్సులో ఒత్తిడిని నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిందని వారు చెపుతున్నారు. కాపురంలో సమస్యలు ఉన్నవారిలో సైటోకైన్స్ ఎక్కువగా ఉంటాయని , దీర్ఘకాలంలో ఇది ఎన్నో వ్యాధులకు దారికి తీస్తాయని చెప్పారు.

Leave a comment