ఎన్నో రకాల పానీయాలు ఇష్టంగా తాగుతూ ఉంటాం. మామిడి, చెరుకు, బత్తాయి మొదలైన పండ్లతో చేసే రసాలు ఇష్టంగా అందరూ తాగుతుంటారు. కానీ కొన్ని రకాల పానీయాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. చాలా సులభంగా చేసుకోగలిగినవి రుచి లో అద్భుతంగా ఉండేవి, అలాగే మంచి ఫలితాలు కూడా ఇచ్చేవి ఈ పానీయాలు ముఖ్యంగా శరీరానికి ఉత్సాహం ఇచ్చే పానీయం పుదీనా రసం. గుప్పెడు పుదీనా ఆకులను నీళ్లలో మరిగిస్తే చాలు ఈ పానీయం తయారైపోతుంది. అలాగే సోంపు. గుప్పెడు సోంపు గింజలు రాత్రంతా నాననిచ్చి ఆ ఉదయం ఆ నీళ్ల తో సహా మరిగిస్తే తీయని రుచి తో కూడిన పానీయం తయారవుతుంది. ఇక నిమ్మరసం ప్రతి ఉదయం తాగినా మంచిదే తేనె నిమ్మరసం నిజంగా అద్భుత పానీయమే. జీలకర్ర, సైంధవ లవణం కలిపి మరిగించి నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగై చల్లగా ప్రశాంతత అందుతుంది. అలాగే కొత్తిమీర పుదీనా కలిపి గుజ్జు చేసి సైంధవలవణం పచ్చిమిర్చి కలిపి మరిగించి ఇందులో నిమ్మరసం కలిపి తాగితే ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అన్నిటికంటే శ్రేష్టమైంది జీలకర్ర పొడి కరివేపాకు కొత్తిమీర ఆకులు ఉప్పు కలిపిన మజ్జిగ కడుపును చల్లబరుస్తుంది. ఇక కలబంద కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద ఆకులను కత్తిరించి లోపల తెల్లని గుజ్జు తీసి ఆ రసాన్ని తాగితే విటమిన్లు, లవణాలు ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి అలసట తగ్గించి దాహం తీర్చే ఈ పానీయాలు అన్నీ శరీరానికి మేలు చేసేవే!

Leave a comment