Categories
WhatsApp

దుస్తులు వెలిసిపోకుండా వుంటాయ్.

సాదాసీదాగా వున్న దుస్తుల ధర కూడా ఇప్పుడు వేలల్లోనే ఉంటుంది. ఉతికితే మెరుపు, కొత్తదనం పోతాయనిపిస్తుంది. కాని కొన్ని డ్రెస్ లు కొంత ప్రత్యేకంగా ఇంట్లో వాష్ చేస్తేనే బావుంటాయి. న్యాచురల్ ఫైబర్ తో ఉత్పత్తి చేసిన కాటన్ సిల్క్ దుస్తుల్ని ఉతికేందుకు సాధారణ డిటెర్జెoట్ చాలు. అలాగే బట్టలు ఉతికేందుకు పెట్టిన నీళ్ళలో అరకప్పు బేకింగ్ సోడా కలిపితే బట్టల దుర్వాసన పోతుంది. దుస్తులు తాజాగా కనిపిస్తాయి. అలాగే నీళ్ళలో వెనిగర్ వేసి బట్టలు నానబెడితే ఫ్యాబ్రిక్ చాలా సున్నితంగా మెత్తగా అయిపోతుంది. బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకగా చివరగా వాటిని నిమ్మరసం కలిపినా నీటిలో ముంచి ఆరవేస్తే మంచి సువాసన తో వుంటాయి. ఒక అరకప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ తో బట్టలు తెల్లగా మెరిసిపోతాయి. ఖరీదైన దుస్తుల్ని ఇలా ఇంట్లో వుతకటం వల్ల సహజమైన రంగులు వెలసిపోకుండా వుంటాయి. కొన్ని దుస్తులను వాటి లేబుల్స్ పై ఇచ్చిన సూచనల ప్రకారం ఉతకాల్సిందే.

Leave a comment