డి విటమిన్ తో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిసిన విషయమే కానీ ఇది ఎముకలకే కాదు గుండెకు మేలు చేస్తుందని అంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. డి విటమిన్ లోపంతో బాధపడే రోగులు బిపీ ల బారిన పడుతున్నట్లు ఒక పరిశీలనలో తేలింది. గత సంవత్సరం ఆస్ట్రేలియా లో మరణించిన ప్రతి నలుగురిలో ఒకరు గుండె జబ్బు వల్లనే మరణించారు. మూడు లక్షల మందితో చేసిన ఒక ప్రయోగంలో గుండెజబ్బు కి విటమిన్-డి లోపానికి సంబంధం ఉన్నట్లు తేలింది. అందుకే ప్రతిరోజు కాసేపైన ఎండలో గడపమని శరీరానికి సూర్యరశ్మి తగలడం మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.

Leave a comment