ఈ చలి రోజుల్లో ముదురు రంగు పరదాలు ఇంటికి  వెచ్చదనాన్ని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నీలిరంగు పరదాలు ఇంటికి వెచ్చదనంతో పాటు ప్రత్యేక అందాన్ని కూడా ఇస్తాయి . ఇందులో ప్రింట్స్ కూడా అందంగానే ఉంటాయి. అలాగే కాంతివంతమైన ముదురు పసుపు రంగు కూడా చక్కని ఎంపిక . దీని పైన పూలు ఇతర ప్రింట్లు ఉన్న చక్కగా ఉంటాయి . ఈ కాలంలో ఎండ ఎక్కువగా ఉండదు కనుక ఇల్లంతా వెలుగుతో వెచ్చగా ఉండాలంటే ఎరుపు రంగు పరదాలు ఎంచుకోవాలి . అలాగే వస్తశ్రేణిలో వెల్వెట్ అయితే బావుంటుంది . గదికి కొత్త కాంతి వస్తుంది . ఈ పరదాలు పదిహేను రోజులకు ఒకసారి మార్చుతూ ఉంటే అలర్జీలు రాకుండా ఉంటాయి  .

Leave a comment