కానిస్టేబుల్ తో సహా ఆపైన హోదా ఉన్న మహిళా పోలీసులందరూ ఇకపై యూనిఫామ్ గా ప్యాంట్ షర్టు మాత్రమే వేసుకోవాలని కర్నాటక రాష్ట్ర పోలీసు యంత్రాంగం పేర్కొన్నది. అలాగే వ్యక్తిగత అలంకరణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది. గర్భిణులైన మహిళా పోలీసులకు కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ ఈ నిబంధనకు మినహాయింపు ఉంది.నేరాస్తులను పట్టుకొనేందుకు యూనిఫారం అయితే సౌకర్యంగా ఉంటుంది. అలాగే పోలీసులంటే గౌరవం పెరుగుతోంది. విధుల్లో ఉన్న పోలీసులు ప్రత్యేకంగా కనిపించాలని ఈ నిర్ణయం తీపుకొన్నాం అంటున్నారు కర్నాటక రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు.

Leave a comment