Categories
దేశంలో ఉత్తమ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంగా పేరు పోందింది పెంచ్ నేషనల్ పార్క్. ఇది బెంగాల్ టైగర్లకు కేంద్రం.మహరాష్ట,మద్యప్రదేశ్ ల మధ్య 293 చదరపు కిలోమీటర్ల వరకు పెంచ్ విస్తరించి ఉంది. మహరాష్ట్ర వైపు ప్రాంతం ఎంతో ప్రాముఖ్యన్ని పొందింది .ఇక మద్యప్రదేశ్ ప్రాంతాన్ని జంతు ప్రేమికులు ఎంతో ఇష్టపడతారు. ఎన్నో జింకలు ,ప్రఖ్యాతమైన కొల్లా రవళి పులులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ప్రఖ్యత నవల ది జంగిల్ బుక్ లో ప్రాస్తావించిన అటవీ ప్రాంతంగా ఈ కేంద్రం ప్రసిధ్ద్ధి పొందింది. 50 పైగా పులులు,ఏనుగులు,నక్కలు,చిరుతలు,ఎలుగుబంట్లు ఉన్నయి.జంతు ప్రపంచం కళ్ళారా చూడలంటే ఈ నేషనల్ పార్క్ చూడాలి.