Categories
వర్షాలు మొదలై,వాతావరణంలో తేమ పెరిగి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కాలంలో తేలికగా జీర్ణం అయ్యో కూరగాయాలు తాజాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆహారం కలుషితం కాదు. వేడిగా ఉన్న భోజనం జీర్ణశక్తి పని తీరు మెరుగు పరుస్తుంది.కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రమాదం అతి సారా వల్లనే. దీనికి పరిష్కారం డీ హైడ్రేషన్ రాకుండా మజ్జిగ తాగటం, తెలికైన బియ్యం జావా తాగటమే . మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ విరేచనలు అరికడుతాయి.దానిమ్మ ,యాపిల్,అరటిపండ్లు తినవచ్చు .దానిమ్మ రసం ఔషధంలాగా పని చేస్తుంది. రోజులో నాలుగైదు సార్లు ఈ రసం తాగవచ్చు.