Categories
బిర్యానీ ఆకుతో పలావ్ చేయడం అందరికీ తెలుసు కాని ఈ ఆకుతో ఎన్నో వైద్యాల్లో సంజీవని మాదిరిగా ఉపయోగపడతుందని తెళియదు. ఈ ఆకులోని పార్దినోలైట్ అనే ప్రత్యేక న్యూట్రోయంట్ కీళ్ళ నొప్పుల వచ్చే నొప్పిని మంటని తగ్గిస్తుంది. ఆకుల్లోని కెఫ్హిన్ ఆమ్లం రుటిన్ అనే పదార్ధాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.ఇది క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. రోమన్ల కాలం నుంచి ఈ ఆకుని పొడీ చేసి నెలరోజుల పాటు పరిగడుపున మందులా తీసుకుంటే మధుమేహం నియత్రించవచ్చు. ఆకుల్ని నీళ్ళలో మరిగించి వాసన పీల్చితే ఒత్తిడీ ఆందోళన తగ్గుతుంది. ఇవి అజీర్తికి మంచి మందు.