సోషల్ మీడియాలో చాలా సార్లు ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ లు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఫేస్ బుక్ లో కూడా చాలా మంది మొహలు ఉండవు.వాళ్ళు స్త్రీలో పురుషులో అర్ధం చేసుకోవడం చాలా కష్టం.వీటి కంటే ప్రమాదం డీప్ ఫేక్ వీడియోలు. పోర్న్ స్టార్ శరీరాలను సెలబ్రిటీల మొహలకు తగిలించి ఈ వీడియోలు తయారు చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్ వేర్లతో చాలా సులువుగా వీటిని రూపొందిస్తున్నారు. వ్యక్తులకు అవమానం కలిగించే ఈ నేరాలు హింస,బ్లాక్ మెయిల్, కాపీ రైట్ పరిధిలోకి తీసుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.

Leave a comment