Categories
మైక్రోస్కోప్ లో చూస్తేనే కనబడే డస్ట్‌మైట్స్ ఇళ్ళల్లో ఉండే దుమ్ములోనే జీవిస్తాయి. శ్వాస సంబంధిత ఇబ్బందుల తెచ్చే ఎన్నో ఎలర్జీలకు కారణం కూడా శుభ్రంగా ఉందనుకొనే ఇళ్ళలో పైన వేలాడే సోఫాలో ,కుర్చీల మూలల్లో ఎక్కడ దుమ్ము పేరుకొంటే అక్కడ స్థావరం ఏర్పారుకొంటాయి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. ఎప్పటి బూజులు అప్పుడు క్లీన్ చేయాలి. డోర్ కర్టెన్స్ పదిహేను రోజులకోసారి మార్చాలి. పరుపులు,దిళ్ళు ఎండలతో వేసి మంచాల అడుగున బూజులు దులిపేయాలి. అన్ని గదుల్లోకి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా కనీసం ఒక్క గంటైయినా తులుపులు తెరిచిపెట్టాలి. సోఫాలు కుర్చీలకు ఉన్న డిజైన్ లలో ఇరుకన్న దుమ్ము వారానికి ఒక రోజు శుభ్రంగా తుడిచేయాలి. ఎన్నో అనారోగ్యాలకు ఈ డస్ట్ మైట్లే కారణం..